TTD on Flower Arrangements Dispute: కర్ణాటక బెంగళూరుకు చెందిన దాత సునీత గౌడ్ వ్యాఖ్యలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో దాతల సహకారంతో టీటీడీ పుష్పాలంకరణ చేయించింది. ఈ క్రమంలోనే సునీత గౌడ్ అనే దాత కూడా కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి పుష్పాలు, విగ్రహాలతో అలంకరణ చేశారు. అయితే తనకు సమాచారం ఇవ్వకుండా విగ్రహాలను టీటీడీ సిబ్బంది తొలగించారంటూ శనివారం ఉదయం సునీత గౌడ్ ఆరోపించారు. దీనిపై టీటీడీ సిబ్బందితో వాదనకు దిగారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది.