కాకినాడ జిల్లాలో దొంగలు బరితెగించారు. వినూత్నంగా చోరీకి పాల్పడ్డారు. కాజులూరు మండలం గొల్లపాలెంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి వచ్చిన దుండగులు.. ఇంట్లో ఉన్న పెంపుడుకుక్కకి మత్తుమందు కలిపిన బిస్కెట్లు తినిపించి.. చోరీకి పాల్పడ్డారు. కుక్క మత్తులోకి జారుకున్న తర్వాత ల్యాప్‌టాప్, ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన కారుతో సహా దొంగలు పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు జరుపుతున్నారు.