పెళ్లైన కుమార్తెకూ కారుణ్య నియామక ఉద్యోగం.. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

3 hours ago 2
తండ్రి మరణంతో కారుణ్య నియామకం కోసం 11 ఏళ్లుగా పోరాడుతున్న ఓ కుమార్తెకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఎస్పీడీసీఎల్‌లో అసిస్టెంట్‌ లైన్‌మేన్‌గా పనిచేసిన ఆమె తండ్రి 2014లో మరణించారు. వివాహిత అనే కారణంతో ఉద్యోగాన్ని నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌ వివాహిత కుమార్తెకు కూడా కారుణ్య నియామకం కల్పించాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం వర్తించే ప్రయోజనాలతో నియామక ఉత్తర్వులు జారీ చేయాలని ఎస్పీడీసీఎల్‌కు స్పష్టం చేశారు.
Read Entire Article