పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య.. జగిత్యాలలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్

1 hour ago 1
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి నేడు మంత్రులు శంకుస్థాపన చేశారు. 25 ఎకరాల్లో నిర్మించనున్న ఈ పాఠశాల సుమారు 2600 మంది విద్యార్థులకు ఉపయోగపడనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలకు ఒకే ప్రాంగణంలో నాణ్యమైన విద్య, ఆధునిక వసతులు కల్పించనున్నారు. నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి కనీసం 10 ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
Read Entire Article