మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా పరిచయమైన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం ఏర్పరచుకుని, అనంతరం వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో బెదిరిస్తూ కోటిన్నర రూపాయలకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రదీప్ కొనేటి అనే వ్యక్తిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి నుంచి బ్యాంకు బదిలీలు, యూపీఐ లావాదేవీలు, ఆన్లైన్ రుణాలు, సుమారు 170 గ్రాముల బంగారు ఆభరణాల రూపంలో డబ్బులు తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితుడిపై గతంలో ఇతర కేసులు కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు.