తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వచ్చే ఆరు నెలల్లో వైద్య కళాశాలలు, జీజీహెచ్లతోపాటు ఎంఎన్జే క్యాన్సర్, టిమ్స్, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 90 శాతం వరకు ఆధునిక, రోబోటిక్ సర్జరీలను ఉచితంగా అందిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ్మ తెలిపారు. నిమ్స్లో ఇప్పటికే 1,000 రోబోటిక్ సర్జరీలు పూర్తయ్యాయి. కొత్త ఆసుపత్రుల నిర్మాణంతో రాష్ట్రంలో 40 వేలకుపైగా పడకలు అందుబాటులోకి రానున్నాయి.