హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు, శోభాయాత్రల సమయంలో భారీ జనసందోహంపై నిఘా కోసం ఏఐ ఆధారిత డ్రోన్లను పోలీసులు వినియోగించనున్నారు. టీజీ క్వెస్ట్‌లో భాగంగా అభివృద్ధి చేసిన ఏఐ ఇంటిగ్రేటెడ్ పోలీసింగ్ వ్యవస్థలో ఇవి పనిచేస్తాయి. గతేడాది మేడారం జాతరలో వినియోగించిన సాంకేతికతను ఇప్పుడు మల్కాజిగిరి పోలీసులు అమలు చేయనున్నారు. జనసమూహంలో అసాధారణ కదలికలను రియల్‌టైమ్‌లో గుర్తించి కమాండ్ కంట్రోల్‌కు సమాచారం పంపడం, రాత్రిపూట నిఘా, ఫేషియల్ రికగ్నిషన్, తప్పిపోయిన వారిని గుర్తించడం వంటి సదుపాయాలు వీటిలో ఉన్నాయి.