తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ.. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కొత్తగా సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తోంది. ప్రైవేట్ భాగస్వామ్యంతో, ఆర్థిక భారం లేకుండా ఈ భవనాల నిర్మించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.