ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలంలో ఆర్ఎంపీ (RMP) ఒకరు యువతిపై లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్ పాల్పడటం కలకలం రేపింది. ఎన్కూరు గ్రామంలో పనిచేస్తున్న ఆ ఆర్ఎంపీ, పరిచయం ఏర్పర్చుకుని సన్నిహిత ఫోటోలు తీసుకున్నాడు. ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని పెళ్లి చేసుకోవాలని లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక రేలకాయలపల్లి యువతి కారేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్సై గోపి ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది.