అవయవదానం.. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. దీంతో తమ వారు ఇక లేరనే కఠిన వాస్తవం తెలిసినప్పటికీ.. బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబ సభ్యులు ఆర్గాన్ డొనేషన్‌కు ముందుకొస్తున్నారు. తమ కుటుంబ సభ్యుడి అవయవాల కారణంగా పునర్జన్మ పొందిన వ్యక్తిలోనే తమ ఆత్మీయుణ్ని చూసుకొని సంతృప్తి చెందుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి అవయవాలు సేకరించడం కుదరదని జీవన్ దాన్ అధికారులు చెబుతున్నారు.