రాష్ట్రంలో సంచలనం రేపుతున్న బండి భగీరథ్ పోక్సో కేసులో.. బండి సంజయ్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తన పేరు, ఫోటోలను వాడొద్దు అంటూ సిటీ సివిల్ కోర్టుకు ఎక్కారు. అంతేకాకుండా ఇప్పటివరకు వాడిన ఫోటోలు, వీడియోలను కూడా తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే స్పందించిన కోర్టు.. ఈ కేసులో బండి సంజయ్ ఫోటోలు, పేరు వాడకూడదని కీలక ఆదేశాలు జారీ చేశారు.