పోయిన ఫోన్లు తిరిగొచ్చాయ్.. సంతోషంలో బాధితులు..

7 months ago 24
మల్కాజ్‌గిరి పోలీసులు తమ అద్భుత పనితీరుతో రూ. 2 కోట్ల విలువైన 1039 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. క్రైమ్ డీసీపీ గుణశేఖర్ నేరేడ్‌మెట్ కార్యాలయంలో వీటిని యజమానులకు పంపిణీ చేశారు. బాధితులు 'సీఈఐఆర్' (CEIR) పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు సాంకేతికతను ఉపయోగించి వీటిని ట్రాక్ చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం 4733 ఫోన్లను మల్కాజ్‌గిరి పోలీసులు స్వాధీనం చేసుకోవడం విశేషం. వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలని, 'ఫైండ్ మై డివైజ్' ఆప్షన్‌ను వాడాలని పోలీసులు సూచించారు.
Read Entire Article