Polavaram Project Rs 1301 Crores Released: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం శుభవార్త చెప్పింది.. తాజాగా మరో రూ.1301 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు పోలవరం ప్రాజెక్టు అకౌంట్‌లోకి నేరుగా జమవుతాయని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. గతంలో రూ.1508 కోట్లు విడుదల చేయగా.. వాటిని ప్రాజెక్టు కోసం ప్రభుత్వం వెచ్చింది. తాజాగా మరోసారి కేంద్రం అడ్వాన్స్ నిధుల్ని కేటాయించింది. మరోవైపు గర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 2న పోలవరం పర్యటనకు వెళుతున్నారు.