ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. శనివారం (జనవరి 04న) రోజున నీటిపారుదల శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణపై పడే ప్రభావంపై సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే.. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు.