వైసీపీ ఎంపీ, వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్రా రవీందర్ రెడ్డితో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో పులివెందులలోని రాఘవరెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు.. అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్ తరలించారు.