డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు మందుబాబులు సరికొత్త ప్లాన్ వేశారు. పోలీసులు ఎక్కడెక్కడ తనిఖీలు నిర్వహించారనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేందుకు వీలుగా 'పోలీస్ మామలు' అనే ఒక వాట్సాప్ గ్రూప్‌ను కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇక ఒక మందు బాబు పోలీసులకు చిక్కడంతో అతడి ఫోన్ చెక్ చేయగా.. ఈ గ్రూప్ దొరికింది. దీంతో ఎస్ఐ ఆ గ్రూపులో చేరి.. ఒక వీడియో పోస్ట్ చేయడంతో.. మందుబాబులకు కిక్కు దిగిపోయింది.