ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వేలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సిగ్నలింగ్ సమస్యలు, సర్వర్ సమస్యల కారణంగా ఏకీకృత కుటుంబ సర్వే వేగంగా జరగని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏకీకృత కుటుంబ సర్వే గడువును ప్రభుత్వం ఫిబ్రవరి పదో తేదీ వరకూ పొడిగించింది. అలాగే ఆఫ్‌లైన్ విధానంలోనూ ఏకీకృత కుటుంబ సర్వే చేసే అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెలాఖరు నుంచి ఆఫ్‌లైన్ అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.