Ongole Rythu Bazar Toor Dal Low Price: బహిరంగ మార్కెట్లో కందిపప్పు, బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ, సామాన్యులకు ఊరటనిస్తూ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఒంగోలులో రైతుబజార్లలో తక్కువ ధరలకే ఈ నిత్యావసరాలను అందుబాటులోకి తెచ్చారు. బహిరంగ మార్కెట్ ధరలతో పోలిస్తే గణనీయంగా తగ్గించిన ధరలతో, కందిపప్పు, బియ్యం కొనుగోలు చేసే అవకాశం సామాన్యులకు దక్కింది. ఇది పేదల బడ్జెట్‌కు కొంత మేలు చేకూర్చే అంశం అంటున్నారు.