మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రవణ్ కుమార్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అప్పీల్ విచారణ పూర్తయ్యే వరకు, వయసు, ఆరోగ్యం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏ ఒక్క షరతు ఉల్లంఘించినా బెయిల్ రద్దవుతుందని కోర్టు హెచ్చరించింది.