ఉమ్మడి ఏపీ పాలనే బాగుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాఖ్యనించినట్లుగా ఓ పేపర్ క్లిప్పింగ్ వైరల్‌గా మారింది. తెలంగాణను అవమానిస్తూ.. రేవంత్ వ్యాఖ్యలు చేశారని, ఏపీలో తిరిగి కలిపే కుట్ర జరుగుతోందని పలువురు ఆ పేపర్ క్లిప్పింగ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు సీఎం రేవంత్ నిజంగా అలా అన్నారా..? ఆయన మాట్లాడిన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.