పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు ప్రపంచంతో పోటీ పడేలా.. అత్యాధునిక సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. దసరా లోపే కొన్ని స్కూళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించారు.