ప్రపంచంలోని టాప్ 100 హాటెస్ట్ ప్రాంతాలు.. తెలంగాణ నుంచి మరో మూడు పట్టణాలు

2 hours ago 3
ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల జాబితాలో ఇప్పటికే ఆదిలాబాద్ ఉండగా.. తాజాగా తెలంగాణ నుంచి రామగుండం, కొత్తపేట, మంచిర్యాల పట్టణాలు కూడా ఈ జాబితాలో చేరాయి. ప్రాణ ఎయిర్ ఏక్యూఐ పోర్టల్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. రామగుండం ప్రపంచవ్యాప్తంగా 59వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ నుంచి 44.4 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణలో భౌగోళిక పరిస్థితులు, పొడి గాలుల ప్రభావం వల్లే ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Read Entire Article