హైదరాబాద్‌లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (NFDB) ప్రధాన కార్యాలయం ప్రపంచంలోని అరుదైన నిర్మాణాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. భారీ చేప ఆకారంలో నిర్మించిన ఈ భవనం.. 'మిమెటిక్ ఆర్కిటెక్చర్'కు నిదర్శనంగా నిలుస్తూ, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది భారతదేశపు సృజనాత్మకతకు ప్రతీకగా నిలుస్తూ.. హైదరాబాద్ నగరానికి కొత్త ల్యాండ్‌మార్క్‌గా మారింది.