తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో వేగాన్ని పెంచడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లోని జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, స్టెనోగ్రాఫర్లు వంటి కొన్ని కేటగిరీల ఉద్యోగులు తప్పనిసరిగా కంప్యూటర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ మేరకు జీఓ నెం. 237ను జారీ చేసింది. ఉత్తీర్ణతతో పాటు ఆఫీసు ఆటోమేషన్ ప్రావీణ్యం కూడా అవసరం. కారుణ్య నియామకాల ద్వారా వచ్చిన ఉద్యోగులు సైతం డిజిటల్ నైపుణ్యాలు కలిగి ఉండాలనే లక్ష్యంతో ఈ నియమాన్ని తీసుకొచ్చారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించని వారిని తొలగించే అవకాశం ఉంది.