సంక్రాంతి పండుగ వేళ చైనా మాంజా ప్రాణాలను బలిగొంటోంది. గాలిపటం ఎగురవేయడానికి ఉపయోగించే చైనా మాంజాతో ఇటీవల నిజామాబాద్‌కు చెందిన ఓ బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అంతేకాకుండా హైదరాబాద్‌లో విధినిర్వహణలో ఉన్న ఓ ఏఎస్‌ఐ గొంతు కోసుకుపోయింది. తాజాగా చైనా మాంజా మరో ప్రాణం బలిగొంది. సంగారెడ్డి జిల్లాలో గొంతు తెగి ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇప్పటికే నిషేధం విధించి చైనా మాంజాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దాని వల్ల ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.