ఎనిమిదేళ్ల ప్రేమకు పెద్దల అంగీకారం దక్కలేదు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయి గుడిలో పెళ్లి చేసుకున్న ప్రేమజంటపై యువతి కుటుంబసభ్యులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. యువకుడిని స్తంభానికి కట్టి కొట్టి, యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, యువతి కోసం గాలిస్తున్నారు. యువతి పనిచేస్తోన్న పోస్ట్ ఆఫీస్‌లో మరో మహిళా ఉద్యోగిపై కూడా దాడి చేశారు.