AP Govt Cancels Corpus Fund For Private Colleges: ఏపీ ప్రభుత్వం కొత్త ప్రైవేట్ విద్యా సంస్థల ఏర్పాటును సులభతరం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య ప్రైవేటు విద్యా సంస్థల చట్టంలో పలు నిబంధనలకు సవరణలు చేశారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్పస్ ఫండ్, ఇతర నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు వినతులతో నిర్ణయం తీసుకున్నారు. రూ.15లక్షల కార్పస్ ఫండ్‌ను రద్దు చేశారు.