డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారి పట్ల ప్రైవేట్ స్కూల్ టీచర్ కఠినంగా వ్యవహరించారు. నాలుగేళ్ల చిన్నారిని స్కేలుతో కొట్టడంతో ఆ బాలికకు గాయాలయ్యాయి. రామచంద్రాపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీచర్ కొట్టడంతో చిన్నారికి గాయాలు కాగా.. బాలిక తల్లిదండ్రులు, బంధువులు స్కూలు వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ విషయమై స్కూలు యాజమాన్యాన్ని నిలదీశారు. ఆ టీచర్ మీద చర్యలకు డిమాండ్ చేశారు.