ఉత్తర తెలంగాణ ప్రజల పాతికేళ్ల నిరీక్షణకు తెరపడింది. రామగుండం-మణుగూరు నూతన రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడమే కాకుండా.. 2026-27 బడ్జెట్‌లో ఏకంగా రూ.2911.84 కోట్ల నిధులు కేటాయించింది. సుమారు 208 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే మార్గం సింగరేణి బొగ్గు రవాణాకు కీలకమైన 'కోల్ కారిడార్'గా మారనుంది. మేడారం వంటి మారుమూల ప్రాంతాలకు అనుసంధానం కల్పిస్తూనే, భద్రాచలం-రామగుండం మధ్య ప్రయాణ దూరాన్ని 90 కిలోమీటర్ల మేర తగ్గించనుంది. ప్రస్తుతం ఈ లైన్ నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి.