Kalvakuntla kavitha Yagam: గులాబీ బాస్ కేసీఆర్ మరో ప్రత్యేక యాగం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తన ఫాంహౌస్‌లో చంఢీ యాగం, రాజశ్యామల యాగం అంటూ రకరకాల పూజలు నిర్వహించిన కేసీఆర్.. ఇప్పుడు ప్రత్యేకంగా నవగ్రహ యాగం నిర్వహిస్తున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 06న) రోజున పండితుల సమక్షంలో వేకువజాము నుంచే కేసీఆర్ దంపతులు యాగంలో పాల్గొన్నారు. అయితే.. కేసీఆర్ ఇప్పుడు ఈ యాగం చేయటం వెనుక కారణమేంటీ అన్నది చర్చనీయాంశంగా మారింది.