ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి.. తెలంగాణలో మళ్లీ రోడ్డెక్కిన మరో 118 జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు

2 months ago 11
బ్యాటరీ అగ్నిప్రమాదాల నేపథ్యంలో తెలంగాణలో నిలిచిపోయిన జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను టీజీఎస్ఆర్టీసీ విడతల వారీగా పునఃప్రారంభిస్తోంది. కఠిన తనిఖీల అనంతరం బుధవారం మరో 118 బస్సులకు క్లియరెన్స్ ఇవ్వడంతో.. ఇప్పటి వరకు రోడ్డెక్కిన బస్సుల సంఖ్య 268కి చేరింది. హైదరాబాద్ బస్ భవన్‌లో చైనా బ్యాటరీ నిపుణులు, జేబీఎం ఇంజినీర్ల సమక్షంలో ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మిగిలిన బస్సులను కూడా త్వరలోనే అందుబాటులోకి తెస్తామని.. అప్పటివరకు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ సాధారణ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు.
Read Entire Article