తెలంగాణ నుంచి బియ్యం దిగుమతి చేసుకునే ప్రతిపాదనను పరిశీలించాలని ఫిలిప్పీన్స్ కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి. టు లారెల్ జూనియర్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. దిల్లీలో జరిగిన సమావేశంలో బియ్యం రకాలు, ధరలు, నాణ్యత, కొనుగోలు విధానం, రవాణా, ధ్రువీకరణ అంశాలపై చర్చించారు. తెలంగాణ నుంచి మాంసం ఉత్పత్తులు, విత్తనాల కొనుగోలుపైనా లారెల్ ఆసక్తి చూపారు. ఎగుమతులకు అనువైన ఉత్పత్తులు, అనుమతులను పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ, కేంద్రం, ఫిలిప్పీన్స్ రాయబార కార్యాలయం సమన్వయంతో ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.