మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి తండాకు చెందిన బానోత్ సాయిప్రియ అనే విద్యార్థిని పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఆత్మహత్య చేసుకుంది. అయితే బుధవారం విడుదలైన ఫలితాల్లో ఆమె 480 మార్కులతో ఉత్తీర్ణురాలైంది. పరీక్షల ఒత్తిడి, భయం కారణంగా ఒక ప్రతిభావంతమైన విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం తండాలో విషాదం నింపింది. ఫలితాల కోసం వేచి చూడకుండానే ఆమె తనువు చాలించడం అందరినీ కలచివేస్తోంది.