ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో.. ఫలితాలు రాకముందే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ రిజల్స్ట్‌లో మాత్రం ఆ విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో పాస్ కావడం గమనార్హం. దీంతో ఆ కుటుంబం ఇప్పుడు తీవ్ర కుంగుబాటుకు గురైంది. మరోవైపు.. ఇవాళ ఇంటర్ ఫలితాలు వెల్లడి కాగా.. ఫెయిల్ అయిన వారి కోసం ఇంటర్ బోర్డు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ వెలువరించింది.