తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా.. చాలా మందిని విచారణ జరిపారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఆయనతోపాటు ఇద్దరు బీఆర్ఎస్ నేతలను కూడా విచారణకు రావాలని ఆదేశఇంచింది. బాధితుల వాంగ్మూలాలు సేకరించడం ద్వారా ఫోన్ ట్యాపింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు.