భారత్ ఫ్యూచర్‌సిటీలో రియల్ ఎస్టేట్ భూం నడుస్తోంది. ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం కేటాయించిన 121 చదరపు గజాల ప్లాట్లకు డిమాండ్ పెరుగుతోంది. గతంలో సుమారు రూ.5 లక్షలకు అమ్ముడైన ప్లాట్లు ప్రస్తుతం రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పలుకుతున్నాయి. ఫ్యూచర్‌సిటీ కార్యాలయం ప్రారంభం, పరిసరాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, రియల్ ఎస్టేట్ కార్యకలాపాల పెరుగుదలతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.