HYD రాయదుర్గంలో యూనిటీ మాల్‌... రూ.2,059 కోట్లతో ట్విన్ టవర్స్ నిర్మాణం

1 hour ago 1
హైదరాబాద్‌ రాయదుర్గంలో రూ.2,059.81 కోట్ల అంచనా వ్యయంతో యూనిటీ మాల్‌ నిర్మాణం చేపడుతున్నారు. 6.12 ఎకరాల స్థలంలో 27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ట్విన్‌ టవర్లు నిర్మించనున్నారు. ODOP కాన్సెప్ట్‌తో తెలంగాణ 33 జిల్లాల ప్రత్యేక ఉత్పత్తులతోపాటు దేశవ్యాప్తంగా హస్తకళలు, చేనేత, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పించనున్నారు. పీపీపీ విధానంలో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఎగ్జిబిషన్‌ గ్యాలరీలు, కాన్ఫరెన్స్‌ హాళ్లు, బిజినెస్‌ లాంజ్‌లు, లాజిస్టిక్స్‌ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
Read Entire Article