తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారులో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయనుండగా... నగర నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఫోర్త్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ, ఐటీ సంస్థల ఏర్పాటుకు కందుకూరు, యాచారం మండలాలకు చెందిన రైతులు దాదాపు 13 వేల ఎకరాల భూములిచ్చారు. ఆయా రైతులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వనుంది.