ఫ్రిజ్ పేలిన ఘటనలు చాలా అరుదు. కానీ అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ప్రాణ నష్టం ఎక్కువగానే ఉంటుంది. తాజాగా హైదరాబాద్‌లో ఫ్రిజ్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లంతా కాలిపోయింది. ఈ నేపథ్యంలో ఫ్రిజ్‌లు పేలడానికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిపుణులు సూచిస్తున్నారు. ఒకటి రెండు రోజుల నుంచి నెలల తరబడి ఇంటికి తాళం వేయాల్సిన పరిస్థితి వస్తే ఏం చేయాలి, ఫ్రిజ్ ఆఫ్ చేయాలా వద్దా అనే డౌట్స్ ఈ కథనంలో క్లియర్ చేసుకుందాం.