ఫ్లైఓవర్ల కోసం ఏకంగా రూ.6 వేల కోట్లు.. హైదరాబాద్‌ రోడ్డలపై ఇక దూసుకెళ్లొచ్చు!

1 month ago 4
హైదరాబాద్‌ నగరంలో రహదారుల విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చుచేస్తోంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌లో హెచ్‌-సిటీ (హైదరాబాద్‌ సిటీ ఇన్నొవేటివ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) లో భాగంగా రూ.5,942 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు ఇస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే టెండర్లు పిలిచి ఈ నిధులతో పనులు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి హెచ్‌-సిటీలో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తాజాగా జీహెచ్‌ఎంసీలోని ఆరు జోన్లలో 5 ప్యాకేజీల్లో చేపట్టనున్న పనులకు నిధులు మంజూరు చేసింది. అందులో భాగంగా సికింద్రాబాద్ జోన్‌లోని ఏవోసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం కోసం రూ.940 కోట్లు విడుదలకు అనుమతులు ఇచ్చింది. శేరిలింగంపల్లి జోన్‌లో ఖాజాగూడ, ఐఐఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ల అభివృద్ధికి రూ. 837 కోట్లు, మియాపూర్‌ ఎక్స్ రోడ్డు నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్డు వరకు ఆరు వరుసల ప్లైఓవర్, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు మూడు వరుసలతో అండర్ పాస్ నిర్మాణానికి రూ.530 కోట్లు విడుదల చేసింది.
Read Entire Article