బంగారం బిస్కెట్ స్కీమ్ పేరుతో మోసం చేసిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. బంగారం బిస్కెట్ పథకం పేరుతో ముచ్చర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు. అయితే స్కీమ్ ఆఖరి దశకు చేరే సరికి నష్టాలు వస్తుందనే కారణంతో బోర్డు తిప్పేశాడు. దీంతో ఖాతాదారులు లబోదిబోమంటూ అజిత్‌సింగ్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు. అయితే ఎంతమేరకు వసూలు చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది.