బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రులు వంగలపూడి అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు వర్షాలపై సమీక్షించారు. అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని హోం మంత్రి అనిత అధికారులను ఆదేశించారు.