ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇవాళ కోస్తాతో పాటూ రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయంటున్నారు. ఆదివారం కోస్తాలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు కురిశాయి.. మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పలకరించాయి. ఓవైపు వర్షాలు పడుతుంటే.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత కనిపించింది. అయితే ఈ నెలలో వరుసగా మూడు తుఫాన్లు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంపై ఆంధ్రప్రదేశ్‌పై కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.