Andhra Pradesh rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వనలు పడతాయని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం 24 గంటల్లో ఏర్పడుతుందని చెబుతున్నారు. ఈ ఫ్రభావంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయంటున్నారు. ఈ ప్రభావం ఏపీపై స్వల్పంగా ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది. రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోసర్తు వానలు పడుతున్నాయి. అంతేకాదు పగటటిపూట ఎండలు మండిపోతున్నాయి.. ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. అయితే ఈ నెలాఖరులో ఏపీలో వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.