హైదరాబాద్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకుని.. దాడులు చేయగా.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇందులో ఆ వ్యభిచార గృహం నిర్వాహకురాలు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ బెడ్రూంలలో స్పైకెమెరాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. దీని వెనుక ఏదైనా సెక్స్ రాకెట్ ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.