Amberpet Bathukamma Kunta: అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట పునరుద్ధరణ పూర్తయి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. రూ. 7 కోట్లతో సుందరీకరించిన ఈ కుంటను వీ.హెచ్ఆర్ బతుకమ్మ కుంటగా నామకరణం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దాదాపు 35 ఏళ్లుగా కబ్జాదారుల నుంచి ఈ కుంటను కాపాడేందుకు వీహెచ్ చేసిన అవిశ్రాంత పోరాటాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కుంట ఇకపై మహిళలకు సాంస్కృతిక కేంద్రంగా నిలవనుంది.