తెలంగాణలో కోటి మంది మహిళలకు 'ఇందిరమ్మ చీరల' పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నారు. ఈ చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారు. పంపిణీని రెండు దశల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. డిసెంబర్ 9 లోగా గ్రామీణ ప్రాంతాల్లో.. మార్చి 1 నుంచి మార్చి 8 లోగా పట్టణ ప్రాంతాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నాణ్యత, పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు.