బతుకమ్మ పండుగ వేళ సంప్రదాయ పూల కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. బతుకమ్మకు ముఖ్యమైన తంగేడు పూలు దొరకడం కష్టంగా మారగా.. బంతిపూల ధరలు కొన్ని మార్కెట్లలో కిలోకు రూ.300 వరకు చేరాయి. ఎల్ నినో కారణంగా తక్కువ వర్షపాతం, పట్టణీకరణ, ఖాళీ స్థలాలు తగ్గిపోవడం సహజ పూల లభ్యతపై ప్రభావం చూపుతున్నాయి. మార్కెట్లలో పూల ధరలు పెరగడంతో ప్రజల పండుగ ఖర్చులు అధికమవుతున్నాయి. పూల కొరత బతుకమ్మ సంప్రదాయాన్ని కొనసాగించే కుటుంబాలకు అదనపు భారంగా మారింది.