బస్సు కొంచెం ముందుకు ఆపారని రెచ్చిపోయిన మహిళలు.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి

1 day ago 3
పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఊహించని ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సు, సిబ్బందిపై కొందరు మహిళలు కోడిగుడ్లతో దాడి చేశారు. గురజాలలోని మాడుగుల రహదారి దగ్గర బస్సును కొంచెం ముందుకు ఆపారనే కోపంతో ఓ మహిళ డ్రైవర్, కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. కొందరు మహిళలు ఆ బస్సు మళ్లీ తిరిగి వచ్చే సమయానికి రోడ్డుకు అడ్డంగా బైకులు పెట్టి, బస్సుపై దాడి చేశారు. అడ్డుకున్న డ్రైవర్, కండక్టర్‌ను కూడా కొట్టారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేసి కొందరుపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
Read Entire Article