బాగున్నారా.. అమ్మా..! రాష్ట్ర మహిళా మంత్రులకు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు..

2 months ago 4
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలని కోరుతూ మంత్రులు సీతక్క, కొండా సురేఖ మాజీ సీఎం కేసీఆర్‌ను ఆయన ఎర్రవెల్లి నివాసంలో కలిశారు. ప్రభుత్వం తరపున అధికారిక ఆహ్వాన పత్రికతో పాటు అమ్మవార్ల ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్, శోభమ్మ దంపతులు మంత్రులను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించి.. సంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమలు, చీరలతో సత్కరించారు. రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ భేటీలో మేడారం అభివృద్ధి పనులపై చర్చించారు. దాదాపు రూ. 200 కోట్లతో జాతర పరిసరాలను తీర్చిదిద్దినట్లు మంత్రులు తెలిపారు. త్వరలో జరగనున్న ఈ మహా జాతరకు తాము తప్పకుండా రావడానికి ప్రయత్నిస్తామని కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.
Read Entire Article